యాంకర్ విష్ణుప్రియ భీమినేని ఇన్స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై ఏఐఎస్‌ఎఫ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్లామర్ పేరిట అశ్లీలతను విక్రయిస్తున్నారనే ఆరోపణలు, ఆమె ఆదాయ వివరాలు మరియు తాజా వివాదంపై పూర్తి కథనం ఇక్కడ చదవండి.
తెలుగు బుల్లితెరపై తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియా సెగలు రేగుతున్నాయి. కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం కాకుండా, 'సబ్‌స్క్రిప్షన్' పేరిట తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అసభ్యకర కంటెంట్‌ను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఆమెను చిక్కుల్లోకి నెట్టాయి. ఒకవైపు కుర్రకారు ఆమె కొత్త అవతారానికి ఫిదా అవుతుంటే, మరోవైపు సామాజిక బాధ్యత గా విద్యార్థి సంఘాలు ఆమె తీరుపై మండిపడుతూ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విజయవాడలో ఫిర్యాదు.. సైబర్ క్రైమ్ నిఘా
విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను అడ్డం పెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ - ఏ ఐ ఎస్ ఎఫ్ నేతలు. సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఆమెపై ఫిర్యాదు చేసారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ నేతృత్వంలో ప్రతినిధి బృందం పోలీసులను కలిసి, విష్ణుప్రియ పోస్ట్ చేస్తున్న కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఖాతాలో అర్ధనగ్న వీడియోలు, ఫోటోలు వీక్షించాలంటే నెలకు నిర్దేశించిన రుసుము చెల్లించాలని ఆమె ప్రచారం చేయడం సమాజానికి ఏం సందేశాన్ని ఇస్తుందని వారు ప్రశ్నించారు. ఈ మేరకు సదరు ఖాతాను తక్షణమే నిలిపివేయాలని , ఐటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
"బంపర్ ఆఫర్" వెనుక ఆదాయ మార్గం
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ హవా పెరిగింది. "ఇంకా కావాలా నాయనా..?" అంటూ ఆమె ఇచ్చే సోషల్ మీడియా అప్‌డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన గ్లామర్ ఫోటోలకు "ఏదీ శాశ్వతం కాదు" వంటి తాత్విక ట్యాగ్ లైన్లు జోడిస్తూనే, తెర వెనుక భారీగా ఆదాయం ఆర్జిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను నెలకు రూ. 390 గా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సుమారు మూడు వేల మందికి పైగా సభ్యత్వం తీసుకున్నారని, ఈ లెక్కన నెలకు కేవలం సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ ద్వారానే ఆమె రూ. 12 లక్షలకు పైగా సంపాదిస్తున్నారని అంచనా. ఒకప్పుడు వెండితెరకు మాత్రమే పరిమితమైన అందాల ప్రదర్శన, ఇప్పుడు ఇలా అరచేతిలోని ఫోన్ ద్వారా 'పెయిడ్ సర్వీస్'గా మారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెలబ్రిటీ హోదా.. సామాజిక బాధ్యత ఎక్కడ?
'పోవే పోరా'షోతో కెరీర్ ప్రారంభించి, 'బిగ్ బాస్' వంటి రియాలిటీ షోల ద్వారా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విష్ణుప్రియ వంటి సెలబ్రిటీలు యువతకు ఆదర్శంగా ఉండాలని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి అశ్లీలతను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు, యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఒక గుర్తింపు ఉన్న వ్యక్తులు నైతిక విలువలను విస్మరించి, కేవలం వ్యూస్ మరియు సబ్‌స్క్రిప్షన్ల కోసం దిగజారడం సిగ్గుచేటని వారు ధ్వజమెత్తారు. గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రచారంలోనూ ఆమె పేరు వినిపించడం, ఇప్పుడు ఈ కొత్త వివాదం తోడవ్వడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
సోషల్ మీడియా - ఒక కత్తి మీద సాము
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరగడంతో నటీనటులు తమకంటూ సొంత వేదికలను సృష్టించుకుంటున్నారు. సినిమా అవకాశాల కోసం వేచి చూడకుండా, వెబ్ సిరీస్ లు, ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధమంటూ సిగ్నల్స్ ఇస్తున్న విష్ణుప్రియ, తన గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేశారు. అయితే, వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక బాధ్యతకు మధ్య ఉన్న సన్నని గీతను ఆమె దాటేశారనేది ప్రధాన ఆరోపణ. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం అశ్లీలతకు తెరలేపడం ఇపుడు చర్చనియామ్సంగా మారింది. ఫిర్యాదు చేసిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ నేతలు దీపక్, సిద్దు, మనోజ్ తదితరులు ఉన్నారు.
పోలీసుల తదుపరి అడుగు.. క్లారిటీ వచ్చేనా?
సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆమె పోస్ట్ చేస్తున్న కంటెంట్ ఎంతవరకు పరిమితులకు లోబడి ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే విష్ణుప్రియకు చట్టపరమైన చిక్కులు తప్పవు. ఈ వివాదంపై విష్ణుప్రియ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. ఆమె దీనిని తన 'వృత్తిపరమైన అవకాశం'గా సమర్థించుకుంటుందా, వివాదం ముదరకముందే వెనక్కి తగ్గుతుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రవర్తన,వారి ఆదాయ మార్గాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి.