న్యూఢిల్లీ, ఏప్రియల్ 17 : మహిళా రిజర్వేషన్లు , నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రధాని మోదీ ప్రసంగాన్ని, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను విశ్లేషిస్తూ రాహుల్ గాంధీ ప్రస్తావించిన ‘16’ అనే అంకె వెనుక ఏదో గూఢార్థం ఉందనే అనుమానాలు రాజకీయ పండితుల్లో వ్యక్తమవుతున్నాయి. నిన్నటి ప్రధాని ప్రసంగంలో శక్తి లోపించిందని, ఆయన మాటల్లో స్పష్టత లేదని విమర్శిస్తూనే, ఆ వైఫల్యానికి కారణం ఏప్రిల్ 16వ తేదీయేనని రాహుల్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

లోక్‌సభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రిని టార్గెట్ చేశారు. నిన్న ప్రధాని మాట్లాడుతున్నప్పుడు తాను చాలా నిశితంగా గమనించానని, ఆయనలో ఎప్పుడూ ఉండే ఉత్సాహం కనిపించలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మాటలు తడబడుతున్నాయని, ప్రజలకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా అది చేరడం లేదని ఎద్దేవా చేశారు. ఒక శక్తివంతమైన నేతగా కనిపించే ప్రధాని, నిన్నటి సభలో ఎందుకు అలా నిస్తేజంగా మారిపోయారో అర్థం కాలేదని, కానీ తన ఫోన్‌లో తేదీని చూడగానే అసలు రహస్యం అర్థమైందని రాహుల్ పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించడం ఒక చారిత్రక తప్పిదమని, దాని పర్యవసానమే ప్రధానిలో కనిపిస్తున్న ఆందోళన అని ఆయన విశ్లేషించారు.

ఏప్రిల్ 16: ఒక రాజకీయ పొడుపు కథ

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో పదేపదే "16" అనే అంకెను ప్రస్తావించడం సభను ఆశ్చర్యంలో ముంచెత్తింది. "నిన్న ఏప్రిల్ 16.. ఆ 16 అనే సంఖ్యే అన్నిటికీ సమాధానం. ఈ చిక్కుముడికి పరిష్కారం ఆ అంకెలోనే ఉంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలుఇపుడ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎవరికి వారు తమకు తోచిన విధంగా విశ్లేషిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక తేదీ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ సంకేతం ఉందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగిన భయాందోళనలను ఈ సంఖ్యతో రాహుల్ ముడిపెట్టారా అనేది మిస్టరీగా మారింది. "నాకు ఆశ్చర్యమేసింది, 16.. అంతా ఆ 16లోనే ఉంది" అని ఆయన అనడం వెనుక ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ఒక సరికొత్త వ్యూహం దాగి ఉందనే విశ్లేషణ ఆశ్చర్యకర చర్చకు తెరలేపింది.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది ఒక రకమైన భయాందోళనకు దారితీస్తుందని రాహుల్ హెచ్చరించారు. ఈ బిల్లును తీసుకురావడం ఒక పొరపాటని అందరికీ తెలుసని, అందుకే ప్రధాని ఆత్మరక్షణలో పడ్డారని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 16 నాటికి ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల కలిగే నష్టాన్ని రాహుల్ ఒక తాత్విక కోణంలో వివరించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో అంకెలకు, తేదీలకు ఉండే ప్రాముఖ్యతను రాహుల్ తనదైన శైలిలో వినియోగించుకోవడం, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడగా కనిపిస్తోంది.

రాహుల్ శైలిలో మార్పు కనిపిస్తోందా?

సాధారణంగా గణాంకాలు, సామాజిక సమస్యల మీద మాట్లాడే రాహుల్ గాంధీ, ఈసారి ఒక సంఖ్యను పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆయన ప్రసంగ శైలిలో వచ్చిన మార్పును సూచిస్తోంది. అయితే, అధికార పక్షం మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తోంది. రాహుల్ గాంధీ కేవలం గందరగోళం సృష్టించడానికి ఇలాంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, లోక్‌సభలో రాహుల్ విసిరిన ఈ '16' నెంబర్ సవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ గల్లీల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మొత్తం పరిణామంపై స్పష్టత రావాలంటే రాహుల్ గాంధీ స్వయంగా ఆ '16' వెనుక ఉన్న పూర్తి వివరాలను బయటపెట్టాల్సి ఉంటుంది. 16 గురుంచి తెలిసిన వారు తనకు మెస్సేజ్ చేయవచ్చని ఆయన కోరారు.

రాహుల్ వ్యాఖ్యల గురించి మీరు ఏమనుకుంటున్నారు ..మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి.