అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతకు ట్రంప్ యంత్రాంగం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ప్రక్రియలో భారతదేశపు గర్వకారణమైన 'తాజ్‌మహల్'ను ఈ ప్రచారంలో వాడుకోవటం అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన వివాదానికి దారితీస్తోంది. అసలు అమెరికా వ్యూహం ఏంటి? భారతీయులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
'బిజినెస్ మోడల్' మారిన ప్రోత్సాహం :
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులతో సహా ఇతర దేశాల వలసదారులను తిరిగి పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్' వివాదాస్పధంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో వలసదారులు స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్ళిపోతే భారీ నగదు ప్రోత్సాహకాన్ని అందుతుంది. అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ – డి హెచ్ ఎస్ తాజా ప్రకటన ప్రకారం, అక్రమ వలసదారులు తమంతట తాముగా దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే వారికి 2,600 డాలర్ల అంటే సుమారు రూ. .15 లక్షలు నగదుతో పాటు, వారి స్వదేశానికి ఉచిత విమాన టిక్కెట్‌ను ప్రభుత్వం అందజేస్తుంది. వాస్తవానికి వలసదారుల్లో ఒకరిని బలవంతంగా పంపడానికి అమెరికన్ ప్రభుత్వం 18,245 డాలర్లను ప్రస్తుతం ఖర్చు చేస్తుంది. కాని ఈ విధానంలో కేవలం 5,100 డాలర్లతోనే అనుకున్న పని చేయగలుగుతుంది . అమెరికన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ నూతన పధకం వెనుక అర్దికభారం తగ్గించాలనే ఎత్తుగడకనిపిస్తుంది. అంటే, ఇది మానవతా దృక్పథం కంటే కూడా అమెరికా ఖజానాను ఆదా చేసే 'బిజినెస్ మోడల్' లా కనిపిస్తోంది.
'ప్రేమ చిహ్నాన్ని' బహిష్కరణకు వాడుతారా?
2001లో జరిగిన సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల దాడుల తర్వాత, దేశ భద్రతను మరింత కఠినతరం చేయడానికి 2002లో డి హెచ్ ఎస్ను ఏర్పాటు చేశారు. దేశంపై జరిగే ఉగ్రదాడులను అడ్డుకోవడం, అమెరికా సరిహద్దులను పర్యవేక్షించడం, అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనలను అమలు చేయడం. దీనిలో భాగంగా వలసదారులను తిరిగి పంపే బాధ్యత కూడా ఈ శాఖ్ చూస్తుంది. అయితే 'ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్' పథకం ప్రచార పోస్టర్లపై తాజ్‌మహల్ చిత్రాన్ని ముద్రించడం భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లైంది. "అమెరికా తన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని స్వేచ్ఛకు చిహ్నంగా చెప్పుకుంటుంది. కానీ, ప్రపంచ వారసత్వ సంపద అయిన తాజ్‌మహల్‌ను ఒక ప్రతికూల అంశానికి ఆదేశంలో అక్రమ వలస దారులను బయటకు పంపించే కార్యక్రమంలో ముఖచిత్రంగా వాడటం వారి అహంకారానికి పరాకాష్ట" అని పర్యాటక రంగ నిపుణులు మండిపడుతున్నారు. దిన్ని కేవలం ఒక ఫోటో వాడకం మాత్రమే అనే కోణంలో కాకుండా భారత దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసే కుట్రగా భావించాలనేది విశ్లేషకుల అభిప్రాయం.
వెంటాడుతున్న వీసా నిబంధనల ఉచ్చు:
అక్రమ వలసదారులే కాదు, పర్యాటక లేదా వ్యాపార నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే వారిపై కూడా ట్రంప్ ప్రభుత్వం భారీ భారం మోపింది. భారత్ సహా 12 దేశాల పౌరులు ఇకపై 15 వేల డాలర్లు అంటే సుమారు రూ.12.5 లక్షలు సెక్యూరిటీ బాండ్ చెల్లించాల్సిందే. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు అమెరికా ప్రయాణం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మెరికా తన దేశ ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలను గౌరవించినప్పటికీ, మరో దేశపు సాంస్కృతిక చిహ్నాలను ఇలాంటి వివాదాస్పద పథకాలకు వాడటం దౌత్యపరమైన మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పటికే సుమారు 22 లక్షల మంది ఈ పథకాన్ని వాడుకున్నారని గణాంకాలు చెబుతున్నా, భారతీయ పర్యాటక సంస్థలు మాత్రం అమెరికా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
అమెరికా ఒకవైపు భారత్‌ను కీలక భాగస్వామి అని పిలుస్తూనే, మరోవైపు ఇలాంటి చర్యలతో భారతీయులను ఇబ్బంది పెడుతుంది. తాజ్‌మహల్ వంటి 'ప్రేమ చిహ్నాన్ని' దేశం నుండి పంపించే ప్రక్రియకు వాడటం కచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన తప్పిదమనే భావాన ప్రజల్లో పెరుగుతున్న నేపధ్యంలో దీనిపై అమెరికన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తో చూడాలి.
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న వలస విధానాలు, వీసా నిబంధనలలో మార్పు , తాజ్‌మహల్ చిత్రాన్ని వలస వాదుల ఏరివేత పధకంలో వినియోగించటం పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.




