ఆమె పేరు మొనాలిసా భోసలే. 2025 ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా పవిత్ర తీరంలో, తీక్షణమైన చూపులతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ కెమెరా కంటికి చిక్కిన ఆ ముఖం.. రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టింది. అమాయకత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ ‘వైరల్ బ్యూటీ’ జీవితంలో ఇప్పుడు ఊహించని తుఫాను చెలరేగింది. ఆ నవ్వు వెనుక ఇప్పుడు చీకటి కోణాలు, చట్టపరమైన వివాదాలు ముసురుకున్నాయి. సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోనాలిసా భోసలే వివాహం చుట్టూ అలుముకున్న రహస్యాలు, ఆరోపణలు ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ గుమ్మం తొక్కాయి. ఈ వివాహంలో చట్ట ఉల్లంఘనలు జరిగాయన్న ఫిర్యాదును స్వీకరించిన కమిషన్,మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా ఎస్పీ డాక్టర్ రవీంద్ర వర్మకు నోటీసులు జారీ చేస్తూ, ఏడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

మహేశ్వర్ నివాసి అయిన మోనాలిసాభోసలే, ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కేరళలో వివాహం చేసుకుంది. అయితే, ఈ వివాహం జరిగినప్పటి నుండి ఆమె వయస్సుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా 2025 ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో చిత్రీకరించిన ఒక వైరల్ వీడియో ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఆ వీడియోలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ కనిపించిన మోనాలిసా, తన వయస్సు 16 ఏళ్లుగా పేర్కొన్నట్లు ఫిర్యాదుదారులు వాదిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే, ప్రస్తుతం ఆమె మైనర్ అవుతుందని, ఈ వివాహం చట్టరీత్యా నేరమని హిందూ సంఘాలు మరియు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒకవేళ అదే నిజమైతే, ప్రస్తుతం ఆమె మైనర్. కానీ, సరిగ్గా ఏడాది తిరగకముందే (మార్చి 11, 2026న) కేరళలో నటుడు ఫర్మాన్ ఖాన్‌తో ఆమె వివాహం జరగడం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

ఒక సామాన్య బంజారా కుటుంబానికి చెందిన చిన్నారిని ప్రాచుర్యం పేరుతో పావుగా వాడుకున్నారా? లేక ఇది అపారమైన ప్రేమా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మానవ హక్కుల కమిషన్ రంగ ప్రవేశం

ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సీ బెంచ్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా కాకుండా, అందిన ఫిర్యాదు ఆధారంగా సీరియస్ గా తీసుకుంది. ఇది కేవలం వయస్సు వివాదం మాత్రమే కాదు.. దీని వెనుక బలవంతపు పెళ్లి ఉందా? గుర్తింపును దాచిపెట్టారా? పత్రాలను ఫోర్జరీ చేశారా? అనే కోణాల్లో విచారణ జరపాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ కేసు రెండు రాష్ట్రాలతో (మధ్యప్రదేశ్ మరియు కేరళ) ముడిపడి ఉండటంతో, ఇరు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కమిషన్ సూచించింది.

కుటుంబ సభ్యుల ఆందోళన.. 'లవ్ జిహాద్' కోణం?

మోనాలిసా తండ్రి జైసింగ్ భోసలే, తల్లి లతా భోసలే మరియు ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ వివాహంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కేవలం ప్రేమ వివాహం కాదని, దీని వెనుక ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర ఉందనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వయస్సు ధృవీకరణ పత్రాల్లో అవకతవకలు జరిగాయని, తప్పుడు పత్రాలతో వివాహం చేసుకున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చట్టపరమైన చిక్కులు - పోలీసు యంత్రాంగం స్పందన

ఒకవేళ కమిషన్ విచారణలో లేదా పోలీసుల దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని తేలితే, ఈ కేసు తీవ్రమైన మలుపు తిరగనుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు లేదా అక్రమ సంబంధాల కింద పోక్సో చట్టం ప్రయోగించే అవకాశం ఉంది. మైనర్ అని తెలిసి వివాహం చేసుకున్నందుకు ఫర్మాన్ ఖాన్‌తో పాటు సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఈ నోటీసులపై ఖర్గోన్ ఎస్పీ రవీంద్ర వర్మ స్పందిస్తూ.. "మానవ హక్కుల కమిషన్ నుండి నోటీసు అందింది. దీనిపై ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తున్నాం. ఆమె పుట్టిన తేదీకి సంబంధించిన విద్యాసంబంధిత పత్రాలు, మున్సిపల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వారం రోజుల్లోగా వాస్తవాలతో కూడిన నివేదికను కమిషన్‌కు అందజేస్తాం," అని తెలిపారు.

డిజిటల్ యుగంలో ఒక వీడియో సృష్టించిన సంచలనం, ఇప్పుడు ఒక వ్యక్తిగత జీవితాన్ని జాతీయ చర్చనీయాంశంగా మార్చింది. ఇది నిజంగానే ప్రేమతో కూడిన పరిణయమా? లేక చట్టాన్ని కళ్లుగప్పి చేసిన అక్రమ వివాహమా? అన్నది పోలీసుల నివేదికతో తేలిపోనుంది. ఏది ఏమైనా, ఒక యువతి భవిష్యత్తు, చట్టబద్ధతతో కూడిన ఈ అంశంలో మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడం వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో తదుపరి ఏడు రోజులు అత్యంత కీలకం కానున్నాయి.

ప్రతి బిడ్డకు భద్రత, న్యాయం పొందే హక్కు ఉంది. ఆమె ఎంత వైరల్ సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ సమానమే. ఇది ఒక అందమైన ప్రేమకథగా ముగుస్తుందా.. లేక ఒక సామాజిక నేరంగా మారుతుందా? వేచి చూడాలి!

కుంభమేళా 'పూసల అమ్మాయి' వివాదంలో కొత్త మలుపు: భర్తపై పోక్సో కేసు నమోదు

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువతి వివాహం ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఇటీవల ఆమె చేసుకున్న మతాంతర ప్రేమ వివాహం సంచలనం సృష్టించగా, తాజాగా ఆమె వయసుపై వెలువడిన నివేదిక ఈ కేసును మరో మలుపు తిప్పింది.

షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ – యెన్ సి ఎస్ టి జరిపిన విచారణలో ఆ యువతి ఇంకా మేజర్ కాలేదని తేలింది. ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా, ఆమె డిసెంబర్ 30, 2009న జన్మించినట్లు నిర్ధారణ అయ్యింది. వివాహం చేసుకున్న సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని కమిషన్ స్పష్టం చేసింది. భారతీయ చట్టం ప్రకారం వివాహానికి కావాల్సిన కనీస వయసు (18 ఏళ్లు) ఆమెకు ఇంకా నిండలేదు. ఈ నివేదిక ఆధారంగా, మైనర్‌ను వివాహం చేసుకున్నందుకు గాను ఆమె భర్తపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియా వీడియోల ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ యువతి, తన ప్రేమ వివాహం విషయంలో గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. అయితే, ఆమె సామాజిక వర్గం, వయసుపై వచ్చిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన జాతీయ కమిషన్, వాస్తవాలను వెలికితీసింది. చట్టపరంగా ఆమె మైనర్ కావడంతో ఈ వివాహం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.

#KumbhMelaBeadsSeller #PusalaAmmai #POCSOCase #InterfaithMarriage #NationalCommissionForScheduledTribes #MinorMarriageCase #SocialMediaViralGirl #TeluguNews Updates #ViralNewsTelugu#SocialMediaViral#ChildMarriageLaw #KodikootaNews#AndhraPradeshNews #TelanganaNews