ఒడిశాలో మానవత్వాన్ని సిగ్గుపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన సోదరి అకౌంట్లో ఉన్న రూ. 20 వేల నగదు కోసం, బ్యాంక్ అధికారుల ఒత్తిడి మేరకు ఒక అన్న తన సోదరి మృతదేహాన్ని భుజాన వేసుకుని బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ కన్నీటి గాధ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అధికారులు స్పందించారు. పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి.
ఫోటో న్యూస్ :
కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్ళు లెక్కపెట్టడానికి ఇంకా కొలమానాలు అందుబాటులోకి రాలేదు. కేవలం రూ. 20 వేల నగదు కోసం బొందలో ఉన్న శవాన్ని మోసుకు వెళ్ళాడు అంటే అతనికి ఆ డబ్బులు యెంత అవసారో ప్రపంచానికి అర్ధమైంది. మనస్సు ఉన్న అందరూ యదా శక్తిగా తమ తమ సామాజిక మాద్యమాల వేదికగా ఈ ఘటనను ముక్త ఖంతంతో ఖండించారు. కేవలం ఒకే ఒక్క రోజులో అతని సమస్య తీరిపోయింది . .. వీడియో వైరల్ అవ్వడంతో.. డెత్ సర్టిఫికేట్, డబ్బులు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి.
ఆయనకు రావాల్సిన డబ్బులు అక్షారాలారూ 19,402 లు చేతికి అందాయి