పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చెలరేగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు సమీపిస్తుండటంతో ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎఫ్-15 పైలట్ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్, ఇజ్రాయెల్ ట్రిపుల్ అటాక్ మరియు హోర్ముజ్ జలసంధి వివాదంపై ప్రత్యేక కథనం.
పశ్చిమాసియా రాజకీయ పటంలో సెగలు పుడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా,ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ ప్రాతిపదికన తుది ఘట్టానికి చేరుకుంది. "అమెరికా తలచుకుంటే కేవలం ఒక్క రాత్రిలోనే ఇరాన్ అస్తిత్వాన్ని తుడిచిపెట్టగలదు" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హెచ్చరిక వెనుక కేవలం మాటల యుద్ధమే కాదు, అత్యాధునిక సాంకేతికత, వ్యూహాత్మక దాడులు మరియు 'డెడ్ లైన్' రాజకీయం దాగి ఉన్నాయి.
చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్: శత్రువుల గుండెల్లో నిద్ర
వాషింగ్టన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఒక ఉత్కంఠభరితమైన సైనిక విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇరాన్ గడ్డపై కూలిపోయిన అమెరికాకు చెందినఎఫ్ -15 ఫైటర్ జెట్ పైలట్‌ను రక్షించడానికి చేపట్టిన 'కాంబ్యాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ' – సి ఎస్ ఏ ఆర్ ఆపరేషన్ సైనిక చరిత్రలోనే ఒక అద్భుతమని ఆయన అభివర్ణించారు.
ఈ మిషన్‌లో అమెరికా తన అమ్ములపొదిలోని అత్యుత్తమ వనరులను రంగంలోకి దించింది. సుమారు 155 విమానాలు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, మరియు రెస్క్యూ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమక్షంలో జరిగిన ఈ ఆపరేషన్ శత్రువుల కళ్ళు కప్పి సాగింది. ముఖ్యంగా, వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కంచుకోటలో చిక్కుకున్నప్పటికీ, అమెరికా అత్యాధునికకాంబ్యాట్ సర్వైవర్ ఇవేడర్ లొకేటర్ – సి ఎస్ ఇ ఎల్ సాంకేతికత సాయంతో అతనిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అమెరికా సాంకేతిక పైచేయిని నిరూపించింది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా, ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని చేరవేసిన ఈ చిన్న పరికరం ఇప్పుడు యుద్ధ క్షేత్రంలో గేమ్ ఛేంజర్‌గా మారింది.
"పవర్ ప్లాంట్ డే" మరియు "బ్రిడ్జ్ డే": ట్రంప్ డెడ్ లైన్
ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్‌కు మంగళవారం రాత్రి వరకు గడువు విధించారు. ఒకవేళ ఇరాన్ మెడలు వంచకపోతే, బుధవారం తెల్లవారేసరికి ఇరాన్ మౌలిక సదుపాయాలు మటుమాయం అవుతాయని హెచ్చరించారు. దీనిని ఆయన “పవర్ ప్లాంట్ డే” మరియు “బ్రిడ్జ్ డే”గా నామకరణం చేయడం గమనార్హం.
అమెరికా ప్రధానంగా ఇరాన్‌లోని కీలక ఇంధన వనరులపై కన్నేసింది. ఇందులో మొదటిది దమావంద్ పవర్ ప్లాంట్ ఇది2,868 మెగావాట్ల సామర్థ్యంతో టెహ్రాన్ ఇంధన అవసరాలను తీర్చే కీలక కేంద్రం. ఇరాన్ అణు స్వప్నానికి చిహ్నం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం కాగా రవాణా వ్యవస్థకు వెన్నెముక వంటి వంతెనలు కరున్-4 ఆర్చ్ బ్రిడ్జ్. వీటిపై దాడులు జరిగితే ఇరాన్ ఆర్థికంగా, సామాజికంగా దశాబ్దాల వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.
అమెరికా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్, లెబనాన్, మరియు గాజాలపై ఏకకాలంలో దాడులు చేస్తూ ఇజ్రాయెల్ తన ప్రతాపాన్ని చూపుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖాదేమీని, ఇమామ్ హుస్సేన్ డివిజన్ ఆర్టిలరీ చీఫ్ కామిల్ మెల్హెమ్‌ను మట్టుబెట్టడం ద్వారా ఇరాన్ గూఢచారి వ్యవస్థను ఇజ్రాయెల్ ఛిన్నాభిన్నం చేసింది. "మేము ఎవరినీ వదలం, ఒక్కొక్కరినీ వెతికి మరీ అంతం చేస్తాం" అన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
హోర్ముజ్ జలసంధి: ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలం
ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన అంశం 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్'. ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన ఈ జలమార్గాన్ని ఇరాన్ అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 111 డాలర్లకు చేరి, గడిచిన నాలుగేళ్లలో గరిష్ట స్థాయిని తాకింది.
పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీలు 45 రోజుల కాల్పుల విరమణ కోసం రాయబారం నడుపుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం పట్టు సడలించడం లేదు. ఆంక్షల పూర్తిగా తొలగిస్తే తప్ప తాము వెనక్కి తగ్గబోమని ఇరాన్ భీష్మించుకుంది. అయితే, "హోర్ముజ్ జలమార్గాన్ని తెరవడమే మా మొదటి ప్రాధాన్యత" అని ట్రంప్ స్పష్టం చేయడం, అవసరమైతే బలప్రయోగం తప్పదని సూచిస్తోంది.
యుద్ధం @ ఏ ఐమరియు టెక్నాలజీ
ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభం యుద్ధ రీతిని మార్చేసింది. ఇది కేవలం బాంబులు, తుపాకులతో జరుగుతున్న యుద్ధం కాదు; ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్మరియు శాటిలైట్ కమ్యూనికేషన్ల మధ్య జరుగుతున్న మేధోమథనం. అమెరికా తన పైలట్లను రక్షించుకోవడానికి వాడిన అత్యాధునిక GPS మరియు ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇజ్రాయెల్ వాడుతున్న ప్రిసిషన్ స్ట్రైక్ డ్రోన్లు యుద్ధరంగంలో టెక్నాలజీ ప్రాముఖ్యతను చాటుతున్నాయి.
ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇది 'పీస్ త్రూ స్ట్రెంత్' (బలం ద్వారా శాంతి) అనే ట్రంప్ సిద్ధాంతానికి నిదర్శనమా, లేక మరో సుదీర్ఘ గల్ఫ్ యుద్ధానికి నాందియా? ఇరాన్ తన పంతం వీడకపోతే, మంగళవారం రాత్రి ఆకాశం అమెరికా క్షిపణులతో ఎర్రబడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రరాజ్యం తన 'గరిష్ట ఒత్తిడి' వ్యూహంతో ఇరాన్ నడ్డి విరుస్తుందా, లేక దౌత్య చర్చలు ఫలిస్తాయా అనేది మరో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఏది ఏమైనా, మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరియు భౌగోళిక రాజకీయాలను శాసించే మహా యుద్ధంగా రూపాంతరం చెందింది.